టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం "సార్". తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు తమిళంలో "వాతి" టైటిల్.
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ 'బంజారా' లిరికల్ వీడియో ఈ రోజు సాయంత్రం 04:04 నిమిషాలకు విడుదల కాబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ పాటను స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి పాడగా, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ గారు స్వరపరిచారు.