మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. గతేడాది చివర్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈమేరకు జనవరి 19వ తేదీన VT 12 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొంటూ మేకర్స్ ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, BVSN ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.