తాజాగా శంకర్ టీమ్ జనవరి 18 నుంచి భారతీయుడు 2 సెట్స్ పైకి వెళుతోంది. తమిళంలో ఇండియన్ 2 – హిందీలో హిందూస్తాన్ 2 పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. మారిన కాన్వాసులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేసే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు. 2.0 వరల్డ్ వైడ్ రిలీజ్ – ఘనవిజయం నేపథ్యంలో భారతీయుడు 2 చిత్రాన్ని అత్యంత భారీతనంతో నిర్మించేందుకు లైకా సంస్థ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 500కోట్ల బడ్జెట్ వెచ్చించనున్నారని తెలుస్తోంది. సంక్రాంతి కానుక గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. సేనాపతి లుక్ ని తాజాగా రివీల్ చేశారు. ఈ చిత్రంలో కళరియపట్టు విద్యలు – ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ ను ఈ చిత్రంలో కమర్షియల్ పంథాలో ఆవిష్కరించనున్నారు. జనవరి 18 నుంచి ఫోకస్ పెడుతున్నాం అంటూ ట్యాగ్ లైన్ తో పోస్టర్ ఆకట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa