ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ‌ళ్లీ ఎన్టీఆర్ బిగ్‌బాస్ హంగామా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 17, 2019, 10:27 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా బిగ్ బాస్ సీజన్ 1 రియాలిటీ షోతో   సెన్సేషన్ క్రియేట్ చేశాడు తారక్. అయితే బిగ్ బాస్ సీజన్ 2ని నాని హోస్ట్ చేయడంతో తారక్ ఇక బిగ్ బాస్ ఎప్పటికీ చేయడు అనే వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేసింది. అయితే బిగ్ బాస్ 1 కంటే కూడా సీజన్ 2‌లో బాగా వివాదం రేగడంతో నాని మరోసారి బిగ్ బాస్ హోస్ట్ చేయను అని తేల్చి చెప్పేశాడు. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 3కి హోస్ట్‌గా మరోసారి తారక్‌ను దించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తారక్ టీమ్‌తో చర్చలు కూడా జరుపుతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. రాజమౌళి డైరెక్షన్‌లో RRR మూవీ కోసం తారక్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాతో తారక్ బిజీగా ఉండనున్నాడు. అందుకే డేట్లు అడ్జస్ట్‌ చేసి తారక్‌ను ఈ షోతో మరోసారి బుల్లితెరపై మెరుపులు మెరిపించాలని చూస్తున్నారు నిర్వాహకులు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa