ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాని తో రొమాన్స్ చేయనున్న మేఘ ఆకాశ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 18, 2019, 11:06 AM

ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమా పనులతో బిజీగా వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్ తో కలిసి నాని సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. థ్రిల్లర్ నేపథ్యంలో సాగిపోయే ఈ కథలో మహిళలకు సంబంధించిన మెసేజ్ కూడా వుంటుందట.


ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా మేఘ ఆకాశ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు తెరకి 'లై' సినిమా ద్వారా మేఘ ఆకాశ్ పరిచయమైంది. ఆ తరువాత ఆమె 'ఛల్ మోహన్ రంగా' సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు ఆమెకి నిరాశనే మిగిల్చాయి. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ఆమె తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే విక్రమ్ కుమార్ నుంచి ఆమెకి కబురు వెళ్లిందని అంటున్నారు. మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఫిబ్రవరి మూడవ వారం నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa