సందీప్ కిషన్ హీరోగా, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్న చిత్రం "మైఖేల్". దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రంజిత్ జయకోడి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయా భరద్వాజ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ కీరోల్స్ లో నటిస్తున్నారు.
వచ్చే నెల మూడవ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా నుండి రేపు ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు ఉదయం తొమ్మిదిన్నర నుండి కూకట్పల్లి లోని భ్రమరాంబ థియేటర్లో మైఖేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుందని, నటసింహం నందమూరి బాలకృష్ణ ట్రైలర్ ను విడుదల చేస్తారని పేర్కొన్న మేకర్స్ తాజాగా ట్రైలర్ రిలీజ్ టైం ను ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 11:07 నిమిషాలకు మైఖేల్ ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa