ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన "డ్రైవర్ జమున" రీసెంట్గానే ధియేటర్లకొచ్చి, ప్రేక్షకులను ఏమాత్రం అలరించకుండా వెనుదిరిగింది. నిన్నటి నుండి ఈ సినిమా డిజిటల్ లో కూడా సందడి చెయ్యడం ప్రారంభించింది.
ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన మరొక చిత్రం "ది గ్రేట్ ఇండియన్ కిచెన్". మలయాళ సూపర్ హిట్ మూవీకి అఫీషియల్ తమిళ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాను R కణ్ణన్ డైరెక్ట్ చేసారు. రాహుల్ రవీంద్రన్ మేల్ లీడ్ లో నటించారు. దురగారామ్ చౌదరి, నీలం చౌదరి నిర్మించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ సినిమా తాజాగా ఫిబ్రవరి మూడవ తేదీన విడుదల కావడానికి ముస్తాబవుతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa