ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ బజ్ : SSMB 28 లో మలయాళ హీరో ..?

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 09:38 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "SSMB 28". త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. శ్రీలీల మరొక కథానాయికగా నటిస్తుంది.


తాజా బజ్ ప్రకారం, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించబోతున్నారని టాక్ నడుస్తుంది. మహేష్ కు ధీటుగా, సమ ఉజ్జి గా ఉండే ప్రతి కథానాయకుడి పాత్రలో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారని వినికిడి. మరి, ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa