గతేడాది "F 3" చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను రేపు ఎనౌన్స్ చెయ్యబోతున్నారని లేటెస్ట్ టాక్. వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించబోతుందంట. ఈ మేరకు రేపు ఉదయం 11:07 నిమిషాలకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నామంటూ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుండి కాసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. దీంతో ఈ అప్డేట్ వెంకటేష్ సినిమాకు సంబంధించినదే అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
పోతే, ఈ ప్రాజెక్ట్ కు హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించబోతున్నారట. KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనుందంట. మరి, ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa