రియల్ స్టార్ ఉపేంద్ర, బాద్షా కిచ్ఛా సుదీప్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ "కబ్జా". R చంద్రు డైరెక్షన్లో అండర్ వరల్డ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రేయా శరణ్ కీరోల్ లో నటిస్తుంది. గతంలో విడుదలైన కబ్జా టీజర్ కు పాన్ ఇండియా ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందించారు.
తాజాగా కబ్జా మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ కి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు రేపు ఉదయం 11:05 నిమిషాలకు కబ్జా రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ జరగబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.