గుణశేఖర్ దర్శకత్వంలో సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత 'శకుంతలం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పిరియాడిక్ మైథలాజికల్ లవ్ డ్రామా షూటింగ్ ని కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఈ పాన్-ఇండియన్ పీరియాడికల్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 3డిలో థియేటర్లలోకి రానుంది.
మల్లికా మల్లికా అనే సోల్‌ఫుల్ ట్రాక్‌ని విడుదల చేసిన తర్వాత తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ రుషివనంలోన అనే టైటిల్ తో అన్ని భాషల్లో జనవరి 25, 2023న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ చిత్రంలో ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది.
ఈ చిత్రంలో మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, కబీర్ దుహన్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa