మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన "వాల్తేరు వీరయ్య" సంక్రాంతి కానుకగా ధియేటర్లకొచ్చి, అశేష ప్రేక్షకాభిమానుల నీరాజనాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద మెగా మాస్ కలెక్షన్లను కొనసాగిస్తున్న ఈ సినిమా తాజాగా 200కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుండి అధికారిక పోస్టర్ విడుదలైంది. పోతే, రీసెంట్గానే వీరయ్య 100కోట్ల షేర్ ను అందుకున్న విషయం తెలిసిందే.
డైరెక్టర్ బాబీ రూపొందించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్లో మాస్ రాజా రవితేజ క్రూషియల్ రోల్ లో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్, బాబీ సింహ, క్యాథెరిన్ ట్రెసా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa