బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, అతని భార్య ఆలియా మధ్య విభేదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆలియా మాట్లాడుతూ తన అత్తపై సంచలన ఆరోణలు చేసింది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, దిక్కుతోచని స్థితిలో తన భర్త ఇంటికి అర్ధరాత్రి వెళ్తే తన అత్తయ్య గెంటేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం దుప్పటి కూడా ఇవ్వలేదని, తన రెండో బిడ్డ నవాజుద్దీన్ కు పుట్టలేదంటూ మాట్లాడిందని చెప్పింది.