విక్టరీ వెంకటేష్, హిట్ ఫ్రాంచైజీ తో సూపర్ హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను కలయికలో "సైంధవ్" అనే ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చెయ్యబడిన విషయం తెలిసిందే. ఈమేరకు విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోలో వెంకటేష్ మాస్సియెస్ట్ అవతార్ లో కనిపిస్తూ, సినిమాపై అంచనాలను ఏర్పరిచారు.
తాజాగా ఈరోజు ఉదయం హైదరాబాద్ లో సైంధవ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, అనిల్ రావిపూడి, నిర్మాతలు సురేష్ దగ్గుబాటి, దిల్ రాజు, హీరోలు, నాని, నాగచైతన్య, రాణా తదితరులు హాజరయ్యారు. రాఘవేంద్రరావు ఫస్ట్ క్లాప్ నివ్వగా, ఫస్ట్ షాట్ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సురేష్ దగ్గుబాటి, నాగచైతన్య, రాణా దర్శకనిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీరోల్ లో నటిస్తున్నారు.