ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ ఈ రోజు శుభవార్త చెప్పారు. అతి త్వరలోనే ఒక ఇంటివాడిని కాబోతున్నానంటూ ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్ లో శర్వానంద్ ఎంగేజ్మెంట్ జరిగింది. రక్షిత రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సింపుల్ అండ్ స్వీట్ గా వీరిద్దరి ఎంగేజ్మెంట్ సెరిమోనీ జరిగింది.
ఈ నేపథ్యంలో తన జీవిత భాగస్వామి రక్షితను ప్రేక్షకాభిమానులకు పరిచయం చేస్తూ శర్వా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఈ అందమైన యువతితో కలిసి జీవితంలో ఒక బిగ్ స్టెప్ తీసుకోబోతున్నాను.. అందుకు మీ అందరి దీవెనెలు కావాలి.. అంటూ శర్వా ట్వీట్ చేసారు. ఎంగేజ్మెంట్ పిక్స్ ను కూడా షేర్ చేసారు.