నాచురల్ స్టార్ నాని "పిల్ల జమిందార్" చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ హరిప్రియ. కన్నడలో పాతికకు పైగా సినిమాలలో నటించి, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను చేజిక్కించుకుంది. టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జై సింహా చిత్రంలోనూ హరిప్రియ ఫిమేల్ లీడ్ లో నటించింది.
సినిమాల విషయం పక్కన పెడితే, హరిప్రియ వ్యక్తిగత జీవితంలో ఒక అమూల్యమైన ఘట్టం చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. గతేడాది డిసెంబర్ లో ప్రేమికుడు, నటుడు వసిష్ఠ సింహాతో నిశ్చితార్ధం చేసుకున్న హరిప్రియ తాజాగా జనవరి 25వ తేదీన అతనితో ఏడడుగులు వేసింది. హరిప్రియ వివాహానికి శివరాజ్ కుమార్, డాలి ధనంజయ తదితర సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఇంకా అఫీషియల్ గా వీరి మ్యారేజ్ పిక్స్ విడుదల కాకపోయినప్పటికీ కొన్ని ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అభిమానులు వీటిని షేర్ చేస్తూ, కొత్త జంటకు హార్దిక శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.