ప్రముఖ బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ తల్లి నిన్న కన్నుమూశారు. ఆమె చనిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. తన తల్లి అనంత విశ్వంలో కలిసిపోయిందని, అయినా తన ప్రతి శ్వాసలో ఆమె నిరంతరం జీవించే ఉంటుందని పేర్కొంటూ విష్ణు ప్రియా భావోద్వేగకరమైన పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసారు. ఈ పోస్ట్ కు తల్లితో దిగిన పిక్ ను జత చేసారు. ప్రియమైన అమ్మ, నువ్వున్నంత కాలం నా వెన్నంటే నిలిచావు.. ఆ తియ్యని జ్ఞాపకాలను నా జీవితాంతం స్మరించుకుంటా.. నువ్వే నా బలం, బలహీనత.. ఈ భూమ్మీద నాకంటూ ఒక మంచి గొప్ప జీవితాన్ని ఇచ్చేటందుకు నువ్వు చేసిన త్యాగాలు, నాపై చూపించిన ప్రేమకు.. నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.. ని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. అంటూ విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఎమోషల్ గా రాసుకొచ్చింది.