యంగ్ హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్రేజీ లవ్ స్టోరీ "18 పేజెస్". కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ తదుపరి ఈ జంట నుండి వచ్చిన 18 పేజెస్ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
సక్సెస్ఫుల్ థియేటర్ రన్ ముగించుకున్న 18 పేజెస్ మూవీ తాజాగా నిన్న అర్ధరాత్రి నుండి డిజిటల్ లో సందడి చెయ్యడం షురూ చేసింది. నెట్ ఫ్లిక్స్ మరియు ఆహా ఓటిటీలలో 18 పేజెస్ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో విభిన్నప్రేమకథగా రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. గోపిసుందర్ సంగీతం అందించారు. సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు.