టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తన మాజీ భార్యపై సంచలన ఆరోపణలు చేశారు. రమ్య, రోహిత్ శెట్టితో ప్రాణహాని ఉందని నరేష్ కోర్టును ఆశ్రయించారు. ఆస్తి కోసం రమ్య తనను చంపేందుకు ప్రయత్నించిందని, రమ్య వల్ల తాను నరకయాతన అనుభవించానని నరేష్ తెలిపారు. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డితో ఫోన్ చేయించి బెదిరించిందని తెలిపారు. తనను చంపేస్తారన్న భయంతో ఎక్కడికి వెళ్లడం లేదని, తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును నరేష్ కోరారు.