నటి జమున తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి 198 సినిమాల్లో నటించారు. పలు హిందీ సినిమాలు కూడా చేశారు. తెలుగులో దొంగ రాముడు, మిస్సమ్మ, చిరంజీవులు, ముద్దు బిడ్డ, భాగ్యరేఖ, భూకైలాస్, ఇల్లరికం, గులేబకావళి కథ, మూగమనుసులు, మంచి మనిషి, బొబ్బిలి యుద్ధం, లేత మనసులు, కీలు బొమ్మలు, దొరికితే దొంగలు, బంగారు పాప, చదరంగం, వద్దంటే డబ్బు, సంతోషం, తెనాలి రామకృష్ణుడు వంటి సినిమాల్లో నటించారు.