'అఖండ' బ్లాక్ బస్టర్ తదుపరి డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని డైరెక్ట్ చేస్తున్నారు. రామ్ కెరీర్ లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ లో శ్రీలీల ఫిమేల్ లీడ్ లో నటిస్తుంది. దసరా కానుకగా గతేడాది అక్టోబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ లో ఆడిపాడి అలరించనుంది.
ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. దాదాపు 300మంది ఫైటర్స్ తో రామ్ పోతినేని తలపడుతున్న ఒక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను తాజాగా చిత్రీకరించగా, అవుట్ పుట్ పై చిత్రబృందం సంతృప్తి కరంగా ఉందంట. అలానే ఈ సినిమా ఇంటర్నల్ ప్లాట్ కు .. కాసింత పొలిటికల్ టచ్ ఉంటుందట.