శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన తదుపరి సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనుంది అని సమాచారం. సబ్జెక్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.