యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని జనవరి 30న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి వెలువడనుంది. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.