ఎంతో కూల్ గా కనిపించే బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్ బీర్ కపూర్ తాజాగా ఒక అభిమానిపై యారగంట్ గా బిహేవ్ చేసారు. తమ అభిమాన నటుడితో సెల్ఫీ దిగుదామని ఎంతో ఆశగా వచ్చిన ఆ అభిమానికి చివరికి నిరాశే మిగిలింది. అంతేకాక రణ్ బీర్ చేతుల్లో ఘోర అవమానం కూడా కలిగింది.
ఇంతకీ జరిగిందేంటంటే, రణ్ బీర్ తో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన అభిమాని ఫోన్ తీసి కెమెరా ఓపెన్ చేస్తుండగా, ఆ మొబైల్ లో ఏదో ప్రాబ్లెమ్ వచ్చి క్యాం త్వరగా ఓపెన్ అవదు. ఆ వెంటనే అభిమాని మరోసారి ప్రయత్నించి చూడగా, అప్పుడు కూడా మొబైల్ లో ప్రాబ్లెమ్ వస్తుంది. ఇంతసేపు ఓపిక పట్టి చూసిన రణ్ బీర్ కి చిర్రెత్తుకొచ్చి, అభిమాని ఫోన్ ని మంచిగా అడిగి తీసుకుని, వెంటనే వెనక్కి విసిరేస్తారు. రణ్ బీర్ వింత చేష్టకి అక్కడ ఉన్నవారంతా షాక్ కు గురయ్యారు.
ఇంకేముంది, నెట్టింట ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. అభిమానుల వల్లే కదా..తనకి స్టార్ డం వచ్చింది.. అలాంటి అభిమానులతో రణ్ బీర్ ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తాడా..? రణ్ బీర్ అభిమానులతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని ..ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఈ విషయంపై స్పందిస్తున్నారు.