సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటిస్తున్న చిత్రం "రైటర్ పద్మభూషణ్". కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఆశిష్ విద్యార్ధి, రోహిణి మొల్లేటి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 3వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
కాసేపటి క్రితమే ఈ సినిమా టైటిల్ లిరికల్ వీడియో విడుదలైంది. "అయ్యబాబోయ్ గందరగోళం" అనే క్యాచీ లిరికల్ సాంగ్ కి కోటి మామిడాల లిరిక్స్ అందించారు. కళ్యాణ్ నాయక్ స్వరపరిచారు.