మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ జల్లికట్టు ఫేమ్ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరితో ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి 'మలైకోట్టై వాలిబన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ చేసారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది. ఈ బిగ్గీలో మోహన్‌లాల్ రెజ్లర్‌గా కనిపించనున్నాడని సమాచారం.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఎంటర్టైనర్ మలైకోటై వాలిబన్లో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, అయితే ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండిmఅధికారిక ప్రకటన రావలిసిఉంది.
రాధికా ఆప్టే, విద్యుత్ జమ్‌వాల్, సోనలీ కులకర్ణి మరియు డానిష్ సైత్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మాక్స్ ల్యాబ్స్ మరియు సెంచరీ ఫిలింస్‌పై జాన్ మరియు మేరీ క్రియేటివ్ ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు.