యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న కొత్త చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". ఇందులో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్, విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ మూవీ టీజర్ విడుదల కాబోతుంది. విశేషమేంటంటే, హనుమాన్ టీజర్ తో పాన్ ఇండియా ప్రభంజనం సృష్టించిన యువ హీరో తేజ సజ్జ టీజర్ ను లాంచ్ చెయ్యనున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.