శరణ్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "Mr. కింగ్". శశిధర్ చావలి డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. రీసెంట్గా విడుదలైన ఫస్ట్ లిరికల్ 'రా రా నా మామ' కు శ్రోతల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది. దీంతో ఈ పాట యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. ఈపాటను మోహన భోగరాజు, ధనుంజయ సీపాన కలిసి ఆలపించగా, కడలి లిరిక్స్ అందించారు.
హాన్విక క్రియేషన్స్ బ్యానర్ పై బొల్లిబోయిన నాగేశ్వరరావు (BN రావు) నిర్మిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. యశ్విక నిష్కల హీరోయిన్ గా నటిస్తుంది.