వచ్చే నెల 3వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి ముస్తాబవుతున్న చిత్రం "మైఖేల్". రంజిత్ జయకొడి డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కీరోల్స్ లో నటిస్తున్నారు.
తాజాగా మైఖేల్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పి ఆడియన్స్ కు క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ రంజిత్. మైఖేల్ సినిమా పీరియాడికల్, రొమాంటిక్, గ్యాంగ్స్టర్ మూవీ అని చెప్పారు. మైఖేల్ కథ 1970, 80, 90 దశాబ్దాలలో ఉంటుందని, ఎక్కువశాతం 90ల కాలంలో ఉంటుందని చెప్పారు. ఫైనల్గా.. మైఖేల్ సినిమా గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో సాగే ఒక అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీ ..అని చెప్పుకొచ్చారు.