అన్స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆహా సంస్థ కాస్తంత ఊరట కలిగించింది. కాసేపటి క్రితమే ఆహా సంస్థ నుండి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బాలయ్యతో పవన్ ఫన్ చిట్ చాట్ చూపరులను ఆకట్టుకుంటుంది. ఇంకా కాస్తంత సీరియస్ గా కూడా ఈ ప్రోమో సాగింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రెజెన్స్ ఫన్ గా ఉంది. చరణ్ తో మరోసారి బాలయ్య ఫోన్ కాల్ మాట్లాడతారు.
పోతే, అన్స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కి రాబోతుంది. మొదటి భాగం ఫిబ్రవరి 3వ తేదీన స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుంది.