జీ 5 ఒరిజినల్ సిరీస్ లో భాగంగా రూపొందిన వెబ్ సిరీస్ "ATM" ఈ నెల 20 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇందులో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ ప్రధానపాత్రలో నటించగా, సుబ్బరాజ్, దివి, రవిరాజ్, కృష్ణ బురుగుల తదితరులు కీలకపాత్రల్లో నటించారు. చంద్రమోహన్ డైరెక్షన్లో దోపిడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ను హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ప్రశాంత్ R విహారి సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కొచ్చిన వారంలోపే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుంది. దీంతో ATM వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి థ్రిల్లింగ్ రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది.