బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'క్రిస్టోఫర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఉదయ్‌కృష్ణ రాసిన ఈ మలయాళ బిగ్గీ ఫిబ్రవరి 9, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం. అయితే, విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ వెల్లడి చేయాల్సి ఉంది.
ఈ సినిమాలో విలన్‌గా వినయ్ రాయ్ నటించారు. ఐశ్వర్య లక్ష్మి, అమలా పాల్, స్నేహ, షైన్ టామ్ చాకో మరియు జిను జోసెఫ్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్‌డి ఇల్యూమినేషన్స్‌పై ఉన్నికృష్ణన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ వర్గీస్ సంగీతం అందిస్తున్నారు.