బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా మొబైల్‌ని విసిరేసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలుత ఓ అభిమాని సెల్ఫీ అడుగగా.. రణబీర్ చిరునవ్వుతో పోజులిచ్చాడు. కానీ ఫోటో సరిగా రాకపోవడంతో మళ్లీ సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. రెండోసారి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ యువకుడిపై రణబీర్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రణబీర్ మొబైల్ తీసుకుని విసిరేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.