నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు తారకరత్న గారు యువగళం పాదయాత్రలో నిన్న సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స ఇప్పించారు. బాలకృష్ణ గారు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. బంధువులకు, శ్రేయోభిలాషులకు తారకరత్న ఆరోగ్య సమాచారాన్ని చేరవేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, మెరుగైన వైద్యం కోసం కుప్పం హాస్పిటల్ నుండి తారకరత్న ను బెంగుళూరులోని నారాయణ హృదయలాయ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. డా. ఉదయ్ నేతృత్వంలోని బృందం తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తారకరత్న ను పరామర్శించడానికి ఈ రోజు సాయంత్రం బెంగుళూరు ఆసుపత్రికి చేరుకోనున్నారు.