RRR తదుపరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో జత కడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ముందుగా 'జనతా గ్యారేజ్' వచ్చింది. ఆ సినిమా కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో వీరిద్దరి కాంబోపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి.
గతేడాది జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారిక ప్రకటన జరిగింది. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో అభిమానులు సినిమా ప్రారంభం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ 30 మేకర్స్ సినిమాకు కీలకమైన సెట్స్ ను భారీ ఎత్తున నిర్మించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారట. ఓపెనింగ్ షెడ్యూల్ ఇందులోనే జరగబోతుందట. అలానే ఈ సెట్స్ లోనే సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కూడా జరుగుతుందంట. మరి, అతి త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతుందని తెలుస్తుంది.