విశ్వనటుడు కమల్ హాసన్ నటవారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా అడుగు పెట్టింది గార్జియస్ బ్యూటీ శృతి హాసన్. కెరీర్ మొదట్లో ఆమెను వరస పరాజయాలు పలకరించి, ఐరన్ లెగ్ ముద్రను వేశాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లో నటించిందో ఇక అప్పటి నుండి శృతి తన సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తుంది. మధ్యమధ్యలో పరాజయాలు పలకరించినా ఆ వెంటనే మరో విజయాన్ని అందుకుని, 37ఏళ్ళ వయసులో కూడా ఇండస్ట్రీలో వరసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ..ఫుల్ బిజీగా ఉంటుంది. శృతి కేవలం నటి మాత్రమే కాదు.. సింగర్ కూడా. ఆమెకంటూ సొంత మ్యూజిక్ బ్యాండ్ కూడా ఉంది.
రీసెంట్గానే మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య , నటసింహం నందమూరి బాలకృష తో వీరసింహారెడ్డి సినిమాల్లో నటించి డబుల్ ధమాకా హిట్ కొట్టిన శృతి ఈ రోజు 37వ పుట్టినరోజును జరుపుకుంటుంది. దీంతో ప్రేక్షకాభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ, ఫ్యూచర్లో మరిన్ని స్టార్ట్ హీరోల సినిమాలలో నటించాలని, మంచి మంచి సక్సెస్ లు అందుకోవాలని కోరుకుంటున్నారు.