ఆస్కార్ నామినేషన్ అందుకుని రీసెంట్గానే చరిత్ర సృష్టించిన RRR మూవీ తాజాగా జపాన్లో మరొక హిస్టారికల్ మూమెంట్ క్రియేట్ చేసింది. జపాన్ లో RRR మూవీ శతదినోత్సవం జరుపుకుంటుంది. జపాన్లో డైరెక్ట్ గా 42 కేంద్రాలలో, షిఫ్ట్స్ లో 114 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రంగా RRR జపాన్లో చరిత్ర సృష్టించింది. దీంతో రాజమౌళి హార్ట్ ఫెల్ట్ నోట్ ను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
గతంలో 100 రోజులు, 175 రోజులు.. ఒక సినిమా థియేటర్లలో ఆడిందంటే చాలా గొప్ప విషయం. కానీ, ఇప్పుడు బిజినెస్ స్ట్రక్చర్ మారిపోయింది. అవన్నీ జ్ఞాపకాలుగా మారిపోయాయి. కానీ, జపాన్ అభిమానులు తిరిగి ఆ పాతరోజుల ఎంజాయిమెంట్ ను తీసుకొస్తున్నారు. లవ్ యు జపాన్ ... అని రాజమౌళి జపాన్ ప్రేక్షకాభిమానులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.