ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి 'వారసుడు' ఈసారి దసరాకి రాబోతున్నాడా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 07:32 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన 67వ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అప్డేట్ కోసం తలపతి అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మైఖేల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే నెల మొదటివారంలో ముఖ్యంగా 1,2,3 తేదీలలో తలపతి 67కి సంబంధించిన ఎక్జయిటింగ్ అప్డేట్ రాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసి, తలపతి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.



ఈ విషయం పక్కన పెడితే, తాజాగా ఈ సినిమా విడుదలపై మీడియాలో ఆసక్తికరమైన న్యూస్ ఒకటి హల్చల్ చేస్తుంది. అదేంటంటే, సంక్రాంతికి 'వారసుడు' గా వచ్చిన విజయ్ ఈ సారి దసరా పండుగకు మరోసారి థియేటర్లకు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.  
గతంలో విజయ్- లోకేష్ కలయికలో వచ్చిన మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ కాంబోపై అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa