నందమూరి హీరో, రాజకీయ నాయకుడు తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే కొనసాగుతుంది. లోకేష్ మొదలెట్టిన యువగళం పాదయాత్రలో నడుస్తూ, ఒక్కసారిగా తారకరత్న కూలబడిపోయారు. ఆ వెంటనే కుప్పంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృద్యాలయాలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. తారకరత్న వెంటే బాలకృష్ణ ఉండి, అన్ని దగ్గరుండి చూసుకుంటుండగా, నిన్న సాయంత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు బెంగుళూరు చేరుకొని, తారకరత్న ఆరోగ్యంపై ఆరా తీశారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సతీసమేతంగా బెంగుళూరు చేరుకొని, చికిత్స తీసుకుంటున్న తారకరత్నను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తారక్, కళ్యాణ్ రామ్ ఇద్దరూకూడా చాలా ఎమోషనల్ అయ్యారు.