కాసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సతీసమేతంగా బెంగుళూరు చేరుకొని, తారకరత్నను పరామర్శించారు. తదుపరి మీడియాతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్..తారకరత్న ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతుంది. అభిమానుల దీవెనలు, ఆలోచనలు ఆయనతో ఉండాలి. అవే ముఖ్యం. ఆయన పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. అలా అని క్రిటికల్ కండిషన్ నుండి బయటపడ్డారని కాదు. స్టేబుల్ గా ఉన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని, ఎక్మో పై లేరు...అని సమాచారం అందించారు.