కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశీ జంటగా నటిస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
తాజాగా ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ 'దర్శన' లిరికల్ వీడియో విడుదలైంది. మెలోడియస్ బ్రేకప్ యాంథెం గా ఈ పాట యువతను ఆకర్షిస్తుంది. ఈ పాటను శ్రావణ భరద్వాజ్ కంపోజ్ చెయ్యగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు.