ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పిన 'మైఖేల్' చిత్రబృందం తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు జనవరి 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ JRC కన్వెన్షన్స్ లో మైఖేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. పోతే, వచ్చే నెల 3వ తేదీన మైఖేల్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
రంజిత్ జయకొడి డైరెక్షన్లో యంగ్ హీరో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌశిక్ జంటగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయా భరద్వాజ్ కీలకపాత్రల్లో నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు.