మెగాస్టార్ చిరంజీవి గారు కాసేపటి క్రితమే స్పెషల్ ట్వీట్ చేసారు. మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలకి నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే అమ్మా... అని చిరు ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు అమ్మ అంజనాదేవి తో తమ చెల్లెళ్లు, తమ్ముళ్ళతో కలిసి దిగిన పిక్స్ ను జత చేసారు. ఈ పిక్స్ లో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, విజయదుర్గా, మాధవి రావు, మెగాపవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన ఉన్నారు.