మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం "రావణాసుర". సుధీర్ వర్మ డైరెక్షన్లో విభిన్న కధాంశంతో కూడిన చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్ విలన్గా నటిస్తున్నారు.
రవితేజ బర్త్ డే సందర్భంగా విడుదలైన స్పెషల్ గ్లిమ్స్ కు ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుండగా, తాజాగా మేకర్స్ రావణాసుర మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు వచ్చే నెల ఐదవ తేదీన రాత్రి ఏడున్నరకు హైదరాబాద్ లోని ప్రిజం లో రావణాసుర నుండి ఎలక్ట్రిఫయింగ్ అండ్ ఎనర్జిటిక్ ఫస్ట్ సాంగ్ విడుదల కాబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. విశేషమేంటంటే, ఈ పాటకు ఉండే ప్రత్యేకమైన ట్రాక్ ను పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ 'శాంతి పీపుల్' పాడడం జరిగింది.