ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా '18పేజెస్'..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 01:41 PM

యంగ్ హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్రేజీ లవ్ స్టోరీ "18 పేజెస్". కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ తదుపరి ఈ జంట నుండి వచ్చిన 18 పేజెస్ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 


సక్సెస్ఫుల్ థియేటర్ రన్ ముగించుకున్న తదుపరి ఈ నెల 27 నుండి అంటే గత రెండ్రోజుల నుండి డిజిటల్ లో సందడి చెయ్యడం షురూ చేసిన 18 పేజెస్ మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న 18 పేజెస్ మూవీ నెట్ ఫ్లిక్స్ నేషన్ వైడ్ టాప్ 3 మూవీ గా, టాప్ సౌత్ ఇండియన్ మూవీగా దూసుకుపోతుంది.


పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో విభిన్నప్రేమకథగా రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. గోపిసుందర్ సంగీతం అందించారు. సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com