మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఏడాది 'ధమ్కీ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది.
పోతే, విశ్వక్ సేన్ న్యూ మూవీ పై ఆసక్తికరమైన వార్త ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ప్రెస్టీజియస్ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విశ్వక్ సేన్ ఒక సినిమా చెయ్యబోతున్నారట. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగ సినిమాల దర్శకుడు, ప్రముఖ గీత రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. పోతే, ఈ సినిమాలో విశ్వక్ తన విశ్వరూపం చూపిస్తారంట.
ఈ విషయాలన్నింటిని స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ బుట్టబొమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పేర్కొన్నారు. మరొక వారంలో విశ్వక్ సేన్ న్యూ మూవీపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఉంటుందని, వీలైనంత వరకు ఈ ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తామని చెప్పుకొచ్చారు.