మాయాపేటిక ...టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ గ్లిమ్స్ రీసెంట్గా విడుదల కాగా దానికి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. థాంక్యూ బ్రదర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ రమేష్ రాపర్తి, శరత్ చంద్రా రెడ్డి, తారక్ నాధ్ బొమ్మి రెడ్డి కలయికలో సెకండ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాకు సంగీతం: గుణ బాలసుభ్రమణియన్, కెమెరా: సురేష్ అందిస్తున్నారు.
తాజాగా మాయాపేటిక చిత్రబృందం సంగీత ప్రచారకార్యక్రమాలను మొదలెట్టినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఫస్ట్ సింగిల్ 'షన్నా షన్నా' లిరికల్ వీడియోను జనవరి 31వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, సునీల్, సిమ్రత్ కౌర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.