నిన్న విడుదలైన "బుట్టబొమ్మ" ట్రైలర్ ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటుంది. హీరో హీరోయిన్లు స్క్రీన్ పై ఫ్రెష్ పెరఫార్మన్సెస్ ఇవ్వడం, బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి ఇంటరెస్టింగ్ ట్విస్ట్ ను జోడించి, అందమైన ఆడోలెసెన్స్ లవ్ స్టోరీగా మేకర్స్ ఈ సినిమాను మలచడం జరిగింది. ఫీల్ గుడ్ ఎమోషన్స్, మెస్మరైజింగ్ BGM తో ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని యిట్టె ఆకర్షిస్తుంది. దీంతో యూట్యూబులో ఈ ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం లో అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ మేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల నాల్గవ తేదీన థియేటర్లకు రాబోతుంది.