కారునాడ చక్రవర్తి డా. శివరాజ్ కుమార్ గారు నటిస్తున్న 125వ చిత్రం "వేద". A హర్ష డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో గానవి లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. గీత పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై గీత శివరాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. రీసెంట్గానే కన్నడలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అదే టైటిల్ తో తెలుగులో అతి త్వరలోనే విడుదల కాబోతుంది. కంచి కామాక్షి కోల్కతా కాళి క్రియేషన్స్ సంస్థ వేద సినిమాను తెలుగులో విడుదల చేస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం వేద మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.