నాచురల్ స్టార్ నాని కెరీర్ లో భారీ బడ్జెట్టుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'దసరా' మూవీ నుండి రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు టీజర్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సెలెబ్రిటీలు ధనుష్, దుల్కర్ సల్మాన్, షాహిద్ కపూర్, రక్షిత్ శెట్టి దసరా టీజర్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
తాజా బజ్ ప్రకారం, దసరా టీజర్ లో ఎలాంటి డైలాగ్స్ ఉండవట. ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు మొత్తానికి దసరా టీజర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే, రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే అన్నమాట.